నగ్నంగా శిష్యుల డ్యాన్స్ లు.. బౌద్ధ సన్యాసి అరెస్ట్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Sep 2018, 3:22 PM IST
Buddhist Monk Accused Of Sex Abuse Allegedly Made Bihar Boys Dance Naked
Highlights

నగ్ననంగా నిల్చోబెట్టినట్లు  డ్యాన్స్ లు చేపించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత బాలురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు సన్యాసిని అదుపులోకి తీసుకున్నారు.
 

శిశ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బౌద్ధ సన్యాసిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలోని బోదగయాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...అంతర్జాతీయ బౌద్ధమత కేంద్రం బిహార్‌లోని బుద్థగయ‌లో ప్రసన్న జ్యోతి బుద్ధిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్ పేరుతో మస్తీపూర్ గ్రామంలో బౌద్ధమఠం నిర్వహిస్తున్నారు. ఇందులో 15 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ బౌద్ధ సన్యాసి బాలరును లైంగికంగా వేధించడంతో పాటు.. అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా ఆ బాలురను నగ్ననంగా నిల్చోబెట్టినట్లు  డ్యాన్స్ లు చేపించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత బాలురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు సన్యాసిని అదుపులోకి తీసుకున్నారు.

15 మంది చిన్నారులను రేపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వారిచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. దీనికి ముందే బాలురకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 15 మంది బాలురు అసోంలోని కార్బి ఆంగ్లోంగ్ జిల్లాకు చెందినవారు. 

loader