Asianet News TeluguAsianet News Telugu

కోల్‌కతాలో కుప్పకూలిన బ్రిడ్జి, శిథిలాల కింద బస్సులు, కార్లు

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ కోల్ కతాలో ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. వంతెన కింద  బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి.అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు.
 

Bridge Collapses In South Kolkata, Many Feared Trapped
Author
Kolkata, First Published Sep 4, 2018, 5:24 PM IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ కోల్ కతాలో ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. వంతెన కింద  బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి.అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు.

   

 

దక్షిణ కోల్ కతాలోని మజీర్ హట్ ప్రాంతంలో  ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చోటు చేసుకొంది. నగరంలో ఉన్న బ్రిడ్జిల్లో ఇదొకటి. కింద రైల్వే ట్రాక్. పైన వాహనాలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి పురాతన కాలం నాటిది కావడంతో ఒక్క సారిగా కుప్పకూలింది

     

2016 మార్చిలో  సెంట్రల్ కోల్ కతాలోని బుర్రబజార్ లో కూడ బ్రిడ్జి కుప్పకూలింది.ఈ ఘటనలో సుమారు 26 మంది మృత్యువాత పడ్డారు. రోజుల తరబడి సహాయక చర్యలు చేసి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు.  

 

 

తాజాగా బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సమాచారం.ఈ ఘటన పై సీఎం మమత బెనర్జీ స్పందించారు. సహాయక చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు.

                


బ్రిడ్జి శిథిలాల కింద నుండి సుమారు 9 మందిని  సహాయక బృందాలు రక్షించాయి. అయితే ఈ బ్రిడ్జి 40 ఏళ్ల క్రితం నాటిదని బెంగాల్ మంత్రి ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు మంత్రి హాకీం ప్రకటించారు. ఇప్పటివరకు ఎవరూ కూడ చనిపోలేదని మంత్రి ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios