మీ చిన్నారుల బుద్ది వికసించాలంటే...

brain needs better nutrition to help  childrens stay active
Highlights

మీ చిన్నారుల బుద్ది వికసించాలంటే... 

చిన్నారుల మెదడు ఎదుగుదలకు ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. అలాగే మెదడు చురుగ్గా ఉండడానికి కూడా ఈ పోషకాలే చాలా ఉపయోగపడతాయి. పోషకాహార లోపం వల్ల పిల్లల మెదడు మందగిస్తుంది. అందువల్ల తమ చిన్నారుల ఆహార అలవాట్ల పట్ల తల్లిదండ్రులు శ్రద్ద వహించి వారు ఆరోగ్యంగా, చురుగ్గా ఎదగేలా పోషకాలు సమపాల్లలో అందుతున్నాయో లేవో చూడాలి. 

తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించిన విజయాలను చూపించుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు.  పసిపిల్లలు కొన్ని సార్లు  స్వయంగా వివిధ ఆసక్తికరమైన కార్యకలాపాలు చేస్తుంటారు. కొన్నిసార్లు వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణకు నృత్యం,  చిత్రలేఖనం, పద్యాలను వల్లె వేయడం వంటివి. ఇలాంటివి పిల్లల తల్లిదండ్రలనే కాదు వారి బంధువులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. చిన్నారులు చేసే ఇలాంటి పనులు తల్లిదండ్రులకు వారి మెదడు యొక్క అభివృద్ధి గురించి చాలా తెలియజేస్తుంది.  ఇలా 6 సంవత్సరాల వయస్సులో పిల్లల మెదడులో 90% అభివృద్ధి చెందుతుందని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇక చిన్నారుల మెదడు ఎదుగుదల, దాని పనితీరు గురించి ఓసారి  తెలుసుకుందాం. మెదడు కంటికి కనిపించని అతిసూక్ష్మ నాడీ కణాలైన న్యూరాన్లతో నిర్మితమై ఉంటాయి. ఇవి మెదడులో సుమారు పదివేల కోట్లదాకా ఉంటాయి.  ఈ న్యూరాన్లు మెదడు లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. అవయవాలకు మెదడుకు మధ్య సమాచారాన్ని చేరవేయడం ఈ న్యూరాన్ల పనే.  ఈ  న్యూరాన్ల ఎదుగులనే మెదడు ఎదుగులగా అభివర్ణిస్తుంటారు.  చిన్నారులుఏ పని కొత్తగా నేర్చుకున్నా వీటి గొప్పతనమే. విడివిడిగా ఉండే ఇవి ఒక్కో పనికి ఒకో రకంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. అయితే పిల్లల వయసు పెరిగే కొద్ది న్యూరాన్లు ఏర్పడటం తగ్గిపోతుంది. ఇందువల్ల చిన్నారులు ఈ వయసులో తమ పరిసరాల నుండి వేగంగా తమ అలవాట్లను నేర్చుకోవాల్సి ఉంటుంది. 

ఈ ఆరేళ్ల వయసులో చిన్నారుల మెదడులో 5 బాగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అవి  ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, పార్టిటల్ లోబ్, కన్పిటల్ లోబ్ మరియు చిన్న మెదడు. ఈ అవయవాలు మెదడులో వివిధ రకాల పనులు చేస్తుంటాయి. ఉదాహరణకు సమస్యల పరిష్కారం, ప్రసంగం,ప్రవర్తన, బావోద్వేగాలు, స్పర్శ, కంటి చూపు, శరీర భాగాల అనుసంధానం మరియు వివిధ పదార్థాల పరిమాణం, ఆకారం గుర్తించడం వంటివి.  అయితే చిన్నారుల్లో  మెదడు వేగంగా ఎదుగుతున్న క్రమంలో దానికి తగినన్ని పోషకాలు అందించాలి. ఇవి ఎదుగుదలకు తోడ్పడుతుంటాయి. 

మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు :

డీహెచ్ఎ, క్లోరిన్, విటమిన్ బి, ఐరన్, అయోడిన్ మరియు జింక్ వంటి పోషకాలు మెదడు ఎదుగుదలకు చాలా అవసరం.   

పోషకాల ఉపయోగాలు :
 
డీహెచ్ఎ : ఇది మెదడు ఎదుగుదలకు అతి ముఖ్యమైన పోషకం. మెదడు అభివృద్ధి వేగంగా చెందాలంటే రోజువారీ తగినంత మోతాదులో ఇది అవసరం. ఇది  పిల్లలలో జ్ఞాపకశక్తిని ఓపికను మెరుగుపరుస్తుంది. 

అయోడిన్ మరియు జింక్ : సాధారణ మెదడు అభివృద్ధి మరియు జ్ఞాపకశక్తిని  ఈ రెండు పోషకాలు చాలా ముఖ్యమైనవి

క్లోరిన్ : ఇది మెదడు యొక్క మెమరీ సెంటర్ అభివృద్ధికి అవసరపడుతుంది. 

ఐరన్ : మెదడు యొక్క సాధారణ  నిర్మాణానికి, అభివృద్ధికి మరియు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
 
విటమిన్ B:  కేంద్రీయ నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇది చాలా అవసరం. తల్లిదండ్రులు సాధారణంగా వారి పిల్లలు అందించే సహజ ఆహార పదార్థాలలో కొన్ని ఈ పోషకాలలో కలిగి ఉంటాయి. కానీ అవి పిల్లల మెదడు ఎదుగుదలకు సరిపోవు. కానీ ఈ విటమిన్ బి లేకపోతే మెదడు మందగించే అవకాశం ఉంది.  
 

loader