వాళ్లంతా దేశ రాజధాని ఢిల్లీలోని టాప్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో అలాంటి స్కూల్స్ లో పేరెంట్స్ చదవిస్తున్నారు. కానీ తమ పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా కనీసం వాళ్ల తల్లిదండ్రులు ఊహించి ఉండరు.

అంత దారుణంగా వారి ఆలోచనలు ఉన్నాయి. కరుడుగట్టిన నేరగాళ్లు కూడా అంత దారుణంగా ఓ ఆడపిల్ల గురించి కామెంట్స్ చేయరు. కానీ వీళ్లు మాత్రం అంతకన్నా నీచంగా మాట్లాడటం గమనార్హం.

లాక్ డౌన్ లో స్కూళ్లు లేక ఇళ్లకే పరిమితం కావడంతో.. ఢిల్లీలోని టాప్ స్కూళ్లకు చెందిన కొందరు విద్యార్థులు ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ‘బాయ్స్ లాకర్ రూమ్’ పేరిట గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్నేహితులంతా ముచ్చటించుకున్నారు.

అయితే.. వాళ్ల మాటల్లో కేవలం అమ్మాయిలే టాపిక్ కావడం గమనార్హం. తమ క్లాస్ అమ్మాయిల డ్రస్ ల గురించి.. వాళ్ల బాడీ పార్ట్స్ గురించి అందులో వారు వర్ణించుకున్నారు.

ఏ అమ్మాయిని టార్గెట్ చేయాలని.. ఎక్కడికి పిలిచి అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేయాలి వంటి డిస్కస్ చేయడం గమనార్హం. అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి గ్రూప్ లలో షేర్ చేసుకున్నారు.

వాళ్ల ఛాటింగ్ వ్యవహారాన్ని ఓ బాలిక బయటపెట్టడంతో.. ఈ వ్వవహారం వెలుగులోకి వచ్చింది. వారంతా కేవలం పది, ఇంటర్ చదివే విద్యార్థులు కావడం గమనార్హం.

కాగా.. వీరి గ్రూప్, వారి ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ప్రతి ఒక్కరూ సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవాంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీంతో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సదరు విద్యార్ధుల గ్రూప్ ని డీ యాక్టివేట్ చేశారు. అనంతరం.. ఆ గ్రూప్ లోని స్టూడెంట్స్ ని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ కూడా స్పందించారు. ఆ విద్యార్థులను అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు. వారిని అరెస్టు చేసి.. విచారిస్తామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.