కంటిచూపు లేకపోయినా, కరోనా బాధితులకు సాయంగా 5 నెలల పెన్షన్... రిచెస్ట్ ఇండియన్ అంటూ సోనూసూద్ ట్వీట్...
సూన్ సూద్ ఫౌండేషన్‌కి రూ.15 వేల రూపాయలను విరాళంగా అందించిన తెలుగు మహిళ...
కంటిచూపు లేకపోయినా తన ఐదు నెలల పెన్షన్‌ను కరోనా బాధితుల కోసం దానం చేస్తూ దాతృత్వం...
‘గాయం విలువ తెలిసినవాడికే, సాయం చేసే గొప్ప మనసు ఉంటుంది’... ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీలో డైలాగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని వరికుంటపాడు గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మీకి ఈ డైలాగ్ సరిగ్గా సూట్ అవుతుంది.
కంటిచూపు లేకపోయినా కరోనా బాధితుల కోసం తన ఐదు నెలల పెన్షన్ డబ్బును సాయంగా అందించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిందీ తెలుగు మహిళ. యూట్యూబ్‌లో చిన్నచిన్న వీడియోలు తీసే బొడ్డు నాగలక్ష్మీ, సూన్ సూద్ ఫౌండేషన్‌కి రూ.15 వేల రూపాయలను విరాళంగా అందించింది.
ఈ విషయాన్ని ట్వీట్ చేసి తెలిపిన సోనూసూద్... తన దృష్టిలో ఆమె అత్యంత ధనిక భారతీయురాలు... ఎదుటివారి బాధను అర్థం చేసుకోవాలంటే కంటి చూపు కూడా అవసరం లేదు... ఓ నిజమైన హీరో అంటూ ప్రశంసించాడు.