శ్రీరాముడు దిగివచ్చినా రేప్ లను ఆపలేడు: బిజెపి ఎమ్మెల్యే

BJP MLA Surendra Singh says Lord Ram can’t stop rapes
Highlights

బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రామభగవానుడు భువికి దిగివచ్చినా అత్యాచారాల వంటి నేరాలను ఆపలేడని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తాను గట్టిగా చెప్పగలనని కూడా అన్నారు.

లక్నో: బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. శ్రీరాముడు భూమి మీదికి దిగి వచ్చినా అత్యాచారాల వంటి నేరాలను ఆపలేడని ఆయన అన్నారు. 

శ్రీరాముడు దిగివచ్చినా అత్యాచారాల వంటి నేరాలను అదుపు చేయలేడని తాను గట్టిగా చెప్పగలనని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ మన ఫ్యామిలీ మెంబర్ గా,  అక్కాచెల్లెళ్లుగా భావించడం మన విధి అని ఆయన అన్నారు. 

సంస్కరణ ద్వారా మాత్రమే అటువంటి నేరాలను అరికట్టగలమని, ఈ విధమైన నేరాలను అరికట్టడంలో రాజ్యాంగం సమర్థంగా పనిచేయలేదని అన్నారు. 

నేరస్థులను పోలీసు ఎన్ కౌంటర్ల ద్వారా అంతం చేయవచ్చునని, మానభంగం చేసేవారిని అదే పద్ధతిలో చూడలేమని, అత్యాచార సంఘటనలను ఆపడానికి ప్రతి ఒక్కరు పిల్లలకు నైతిక విలువలను నేర్పించాల్సి ఉంటుందని అన్నారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శూర్ఫణఖగా, ప్రధాని నరేంద్ర మోడీని శ్రీరాముడిగా గతంలో ఆయన అభివర్ణించి వివాదం సృష్టించారు.

loader