Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ బైపోల్: బీజేపీ క్యాంపెయిన్‌లో హైటెన్షన్.. గన్నులు తీసిన దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బంది.. ఇదే వీడియో

పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికల వేడి రాజుకుంటున్నది. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో పరిస్థితులు హైటెన్షన్‌గా మారుతున్నాయి. తాజాగా, బీజేపీ క్యాంపెయిన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి తోపులాట జరిగింది. దిలీప్ ఘోష్‌కు రక్షణనివ్వడంలో భాగంగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు గన్‌లను తీసి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
 

bjp campaign became high tension in bengal guns pulled out
Author
Kolkata, First Published Sep 27, 2021, 2:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బైపోలింగ్ క్యాంపెయిన్‌లు వేడెక్కాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో టెన్షన్ టెన్షన్‌గా పరిస్థితులున్నాయి. ఇరుపార్టీల నుంచి పోటాపోటీగా ప్రచారం జరుగుతున్నది. ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా క్యాన్వాసింగ్ జరుగుతున్నది. తాజాగా, భవానీపూర్‌లో బీజేపీ ప్రచారం ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ బీజేపీ యూనిట్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సారథ్యంలో జరుగుతున్న క్యాన్వాసింగ్ కార్యక్రమం హైటెన్షన్‌గా మారింది. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో పరిస్థితులు సీరియస్ అయ్యాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితులను అదుపులోకి తేవడానికి, రాజకీయ కార్యకర్తలను చెదరగొట్టడానికి దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బందిలో ఇద్దరు గన్‌లనూ బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

భవానీపూర్‌లో ప్రచారం దూకుడును పెంచాలని భావించిన బీజేపీ అందుకు తగినట్టుగానే ఉదయం నేతలు క్యాంపెయినింగ్‌కు దిగారు. టీఎంసీ కార్యాలయం సమీపంలోనే ఓ వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో దిలీప్ ఘోష్ క్యాన్వాసింగ్ చేస్తూ వేదికవైపు కదిలారు. కానీ, దారి మధ్యలో టీఎంసీ కార్యకర్తల నిరసనలు కనిపించాయి. అయినప్పటికీ వారు ముందుకే సాగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది.

 

టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దిలీప్ ఘోష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిలీప్ ఘోష్‌ను ఆందోళనకారుల నుంచి కాపాడటానికి ఆయన భద్రతా సిబ్బంది కష్టించాల్సి వచ్చింది. అయినప్పటికీ పరిస్థితులు అదుపుదాటేలా ఉండటంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గన్‌లు తీశారు. బహుశా వాటిని గాల్లో కాల్చి పరిస్థితులను అదుపులోకి తేవాలని భావించి ఉండొచ్చని కొన్ని కథనాలు చెప్పాయి.

అనంతరం, బీజేపీ ఏర్పాటు చేసిన వేదికపైకి అర్జున్ సింగ్, సువేందు అధికారి, అగ్నిమిత్రా పాల్, ప్రియాంక తబ్రేవాల్‌లు ఎక్కి మాట్లాడినట్టు తెలిసింది. తనపై దాడి జరిగిందని దిలీప్ ఘోష్ అన్నారు. భవానీపూర్ ప్రజలను బెదిరించడానికి దిలీప్ ఘోష్ ప్రయత్నించినట్టు తెలిసిందని టీఎంసీ లీడర్ మదన్ మిత్రా అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios