నలుగురు విద్యార్థులు అసహజంగా శృంగారం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. విద్యార్థుల చేత బలవంతంగా ఈ అసహజ శృంగారం చేయించిన  ఏడుగురు వ్యక్తులను  పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ లోని బెగురసూరయ్ లోని ఓ హాస్టల్ కొందరు విద్యార్థులు వసతి పొందుతున్నారు. కాగా.. ఆ హాస్టల్ లోని నలుగురు విద్యార్థులు కిడ్నాప్ కి గురయ్యారు. వారిని కిడ్నాప్ చేసి పట్టణానికి తీసుకువచ్చారు.

వారిని చిత్రహింసలు పెట్టి.. బలవంతంగా ఒకరితో మరొకరు అసహ శృంగారం చేసేలా ఒత్తిడి చేశారు. అంతేకాకుండా వారిచేత బలవంతంగా మద్యం కూడా తాగించారు. ముఖ్యంగా 18నుంచి 21 వయసుగల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని.. వారిని కిడ్నాప్ చేసి అసహజ శృంగారం చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు అలా అసహజంగా శృంగారం చేస్తున్న సమయంలో వీడియో తీసి వాటిని పోర్న్ వెబ్ సైట్లలో ఉంచుతున్నారు.

అలా తీసిన వీడియో ఒకటి వైరల్ గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా.. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇలాంటి ముఠాల కోసం పోలీసులు దాడులు కూడా చేపడుతున్నారు.  బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.