పాట్న: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగేది లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. ఎంతమంది బుజ్జగిస్తున్నా రాహుల్ మాత్రం మెట్టుదిగడం లేదు. బుజ్జగింపులకు కూడా రాహుల్ గాంధీ లొంకలేదు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన కురువృద్ధులు సైతం పార్టీ బాధ్యతలు తీసుకోవాలని మీరే ఉండాలని బ్రతిమాలుడుతున్నప్పటికీ రాహుల్ మనసు మాత్రం కరగడం లేదు. సీడబ్ల్యూసీలోని సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ ఇటీవలే లేఖను సైతం విడుదల చేశారు. 

రాహుల్ గాంధీ దేనికి లొంగకపోవడంతో ఇక బెదిరింపులకు దిగితే దిగొస్తాడనుకున్నారో ఏమో బెదిరింపులకు దిగారు పాట్నకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు. రాహుల్ గాంధీ రాజీనామాను వెనక్కి తీసుకోకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడతామంటూ బీహార్ కు చెందిన 12 మంది కార్యకర్తలు హెచ్చరించారు. 

రాహుల్ గాంధీ జూలై 11లోపు తన రాజీనామాను ఉపసంహరించుకోకపోతే జూలై 12న తమ 12మంది కాంగ్రెస్ కార్యకర్తలం ఆత్మహత్య చేసుకుంటాం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బీహార్ లో ఈ ఫ్లెక్సీలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.  

ఇకపోతే రాహుల్ గాంధీ శనివారం బీహార్ లోని పాట్న కోర్టుకు హాజరయ్యారు. గతంలో రాహుల్‌పై బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ పరువునష్టందావా  కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్‌ పాట్నా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. రూ.10 వేల పూచీకత్తుపై రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది.