భువనేశ్వర్: ఒడిశాలో దారుణమైన సంఘటన జరిగింది. గత పది రోజుల వ్యవధిలో ఒడిశాలో ఇటువంటి సంఘటన ఇది రెండోది. తన భార్యపై తన కజిన్ అత్యాచారం చేస్తుండగా భర్త వీడియో తీశాడు. ఈ సంఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లా ఘాసీపురాలో జరిగింది.

ఆ సంఘటన జరిగినప్పుడు మహిళ భర్త, అతని మిత్రుడు కూడా తాగి ఉన్నారు. తనపై అత్యాచారం జరుగుతున్న సమయంలో మహిళ పెద్దగా కేకలు వేస్తోంది. ఆ కేకలు విని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు మహిళను రక్షించి, అనందపూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

ఇటువంటి సంఘటనే జూన్ 20వ తేీదన కేంద్రపర జిల్లాలోని రాజనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మహిళను ఆమె భర్తకు చెందిన మిత్రుడు రేప్ చేశాడు.