బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు.

ఈ ఏడాది జూలైలో 27 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమె చికిత్స తీసుకొని కోలుకొంది. ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే ఈ ఏడాది జూలై 24న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.

ఈ ఏడాది ఆగష్టు చివర్లో మళ్లీ అదే మహిళకు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం బెంగుళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.ఆగష్టు చివరి వారంలో కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించుకొంటే కరోనా సోకినట్టుగా తేలిందని డాక్టర్ ప్రతీక్ పాటిల్ చెప్పారు. 

ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. రెండు దఫాలు కూడ ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని వైద్యులు చెప్పారు.మొదటిసారి కరోనా సోకి కోలుకొన్న తర్వాత శరీరంలో యాంటీబాడీస్ సరిగా పెరగని కారణంగానే రెండోసారి ఆమెకు కరోనా సోకిందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.