Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ రాకెట్ గుట్టురట్టు... ముగ్గురు అరెస్ట్

బెంగళూరులో అక్రమంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మహిళలను బలవంతంగా ఈ వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

Bengaluru: Prostitution racket busted, 3 held for trafficking women
Author
Hyderabad, First Published Apr 1, 2019, 11:15 AM IST


బెంగళూరులో అక్రమంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మహిళలను బలవంతంగా ఈ వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు హాసన్ జిల్లాకు చెందిన దీపక్ గౌడ్(30), కాశి(21),  మైసూరుకి చెందిన ప్రజ్వల్(21)లుగా గుర్తించారు. ఈ ముగ్గురు యువకులు మహిళలను బలవంతంగా ఈ నరకపు కూపంలోకి దింపి.. వారితో వ్యభిచారం చేయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. హనుమంత్ గౌడ రోడ్డులోని చిక్కసాండ్ర ప్రాంతంలో వీరు ఈ వ్యవహారాలు సాగిస్తున్నారు.

పోలీసులు దాడులు చేసిన నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు మహిళలను ఈ నరకం నుంచి రక్షించారు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి.. చివరకు వారిని ఈ వృత్తిలోకి దించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios