బెంగళూరు నగరంలో స్పా మాటున సాగుతున్న వ్యభిచారం రాకెట్ గుట్టును బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలోని మహదేవపుర ప్రాంతంలోని హూడీ గ్రామంలో నిర్వహిస్తున్న స్పా లో రహస్యంగా ఆరుగురు మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. 

Also Read దారుణం: లోదుస్తులు విప్పించి, గుంపులో స్త్రీలను నగ్నంగా నిలబెట్టి....

దీంతో సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి వ్యభిచారం రొంపి నుంచి ఆరుగురు మహిళలను కాపాడారు. స్పా నిర్వాహకులైన ముగ్గురు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్పా బాగోతంపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు.