Asianet News TeluguAsianet News Telugu

న్యూడ్‌ ఫోటోలు పంపు: లేకపోతే ఆత్మహత్య చేసుకొంటా, చివరికి....

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది.

Bengaluru Insta friend blackmails minor girl to get her nude photos lns
Author
Bengaluru, First Published Feb 8, 2021, 9:31 PM IST

బెంగుళూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది.

బెంగళూరులోని అగ్రహార దసరహల్లి ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు గత జనవరి నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కార్తిక్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.ఈ పరిచయంతో వీరిద్దరూ తరచుగా చాటింగ్ చేసుకొనేవారు.  ఆ తర్వాత కాలంలో ఆ వ్యక్తి బాలికను న్యూడ్ ఫోటోలను పంపాలని వేధింపులకు గురి చేశాడు.

కొద్దిరోజులు ఇద్దరి మధ్య చాటింగ్‌లు నడిచాయి. ఆ తర్వాతి నుంచి బాలికను న్యూడ్‌ ఫొటోలు పంపాలంటూ అతడు వేధించసాగాడు. న్యూడ్ ఫోటోలు పంపకపోతే చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తానని బెదిరించాడు.

ఈ బెదిరింపులకు భయపడిన ఆ బాలిక కొన్ని న్యూడ్ ఫోటోలను పంపింది. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios