Asianet News TeluguAsianet News Telugu

కరోనా పంజా: ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు, ఆక్సిజన్ సిలిండర్లకు గిరాకీ

కర్ణాటకలో సెకండ్ వేవ్‌ పంజా విసురుతోంది. డిశ్చార్జిల కంటే యాక్టివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అయితే ఐసీయూలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆక్సిజన్‌ సిలిండర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు గిరాకీ ఏర్పడింది.
 
bengaluru coronavirus cases rise demand oxygen
Author
Bangalore, First Published Apr 7, 2021, 3:34 PM IST

కర్ణాటకలో సెకండ్ వేవ్‌ పంజా విసురుతోంది. డిశ్చార్జిల కంటే యాక్టివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అయితే ఐసీయూలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆక్సిజన్‌ సిలిండర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు గిరాకీ ఏర్పడింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూలో 351 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉంది. గతేడాది 2020, సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటున రోజుకి 814 ఐసీయూ కేసులు నమోదు అయ్యాయి.

అప్పట్లో 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతూ ఉండేది. ఇప్పుడు అంతేస్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా లేదని అధికారులు వాపోతున్నారు. ఆస్పత్రులు, ఆక్సిజన్‌ సిలిండర్ల బ్యాంకుల్లో కూడా డిమాండ్‌ మేర సరఫరా లేకపోవడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది. 

ప్రస్తుతం ఇళ్లకు అద్దెకు ఇచ్చే ఆక్సిజన్‌ సిలిండర్ల డిమాండ్‌ కూడా 10–15 శాతం మేర పెరిగింది. కొందరు ముందు జాగ్రత్త చర్యగా ఆక్సిజన్‌ సిలిండర్లను ముందుగానే కొనేస్తుండటంతో కొరత ఏర్పడింది.

గతేడాది బెంగళూరు పరిధిలో 70 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయగా.. ప్రస్తుతం 53 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్లకు గిరాకీ పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios