Asianet News TeluguAsianet News Telugu

మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బీర్ ధర..!

ఇక ఆల్కహాల్ ధరలను మాత్రం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లోకల్ బ్రాండ్స్ తోపాటు...  విదేశీ బ్రాండ్ల ధరలను కూడా పెంచేశారు.

Beer gets cheaper in CM yogi adityanath's Uttar pradesh, know how much
Author
Hyderabad, First Published Apr 2, 2021, 1:02 PM IST

మందుబాబులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు వినిపించింది. కొత్త ఎక్సైజ్ చట్టం తీసుకువచ్చింది. దాని ప్రకారం.. బీర్ ధర భారీగా తగ్గించింది. బీర్ పై   రూ.20 తగ్గింపు అందించనున్నట్లు ప్రకటించింది.

మామూలుగా అయితే.. బీర్ ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే..మందుబాబులు ఎక్కువగా చల్లగా ఉంటాయని బీర్ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. కాగా.. ఇప్పుడు ఆ బీర్ పై ఇప్పుడు రూ.20 తగ్గిస్తూ అందిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఇక ఆల్కహాల్ ధరలను మాత్రం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లోకల్ బ్రాండ్స్ తోపాటు...  విదేశీ బ్రాండ్ల ధరలను కూడా పెంచేశారు. దాదాపు 15 నుంచి 20శాతం ధర పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేట్లన్నీ.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుండటం గమనార్హం.

కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ 2020 నుంచి నవంబర్ 2020 లో కేవలం 17.28 కోట్ల బాటిల్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకముందు సంవత్సరం 27.08 కోట్ల బాటిల్స్ అమ్ముడయ్యాయి. అంటే దాదాపు 36శాతం అమ్మకాలు పడిపోయాయి.

రాజస్థాన్ ప్రభుత్వం కూడా బీర్ ధరను తగ్గించింది. రాజస్థాన్ లో లాక్ డౌన్ తో మద్యం షాపులు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. 2019-20 ఏడాదిలో 2 కోట్ల 65 లక్షల బీర్ల కేసులు అమ్ముడు పోయాయి. 2020 -21 సంవత్సరంలో ఆ సంఖ్య ఒక కోటి 60 లక్షలకు తగ్గింది. కేవలం 95 లక్షల బీర్ల కేసులు మాత్రమే అమ్ముడు పోయాయి. బీర్ల రేట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీ పెంచడంతో బీర్ల అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.

బీర్లు తాగేందుకు మందుబాబులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. బీర్ తక్కువ రేటుకే లభించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు భారీగా రెవెన్యూ తగ్గడంతో బీర్ల అమ్మకాల విషయంలో ఎక్సైజ్ పాలసీలో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం..బీర్ల ధరలు రూ. 30 నుంచి రూ. 35 వరకు తగ్గనున్నాయి. బీర్ బ్రాండ్ ను బట్టి ధరలు మారనున్నాయి. బీర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా కొత్త ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేశారు. దీని ప్రకారం…వాటి ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ ఛార్జీని తగ్గించారు.

Follow Us:
Download App:
  • android
  • ios