Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో వెరైటీ పెళ్లి పత్రిక: హల్ టిక్కెట్టు నమూనాలో వెడ్డింగ్ కార్డు

హల్ టిక్కెట్టుు రూపంలో పెళ్లి పత్రికను ముద్రించి పంచారు పార్వతి, బసవరాజ్ దంపతులు. విద్యార్థుల్లో పరీక్షలు అంటే భయాన్ని తొలగించేందుకు ఈ ప్రయత్నం చేసినట్టుగా చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో ఈ పెళ్లి పత్రిక గురించి చర్చించుకొంటున్నారు.

Baswaraj,parwathi couple Variety wedding card in karntaka
Author
Belagavi, First Published Feb 19, 2020, 7:38 AM IST


బెంగుళూరు: విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు ఓ జంట వినూత్న ప్రయత్నం చేశారు. హల్ టిక్కెట్టు తరహలో పెళ్లి పత్రికను తయారు చేయించి బంధు మిత్రులకు పంచారు. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు ఈ జంట ఈ ప్రయత్నం చేసింది. 

Also read:పుష్పక విమానంలో దిగిన వధూవరులు: విజయవాడలో వెరైటీ పెళ్లి వేడుక

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన పార్వతి, బసవరాజు  ఈ నెల 16వ తేదీన పెళ్లి చేసుకొన్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పలు పరీక్ష్లల్లో విద్యార్థుల్లో భయాన్ని  పొగొట్టేందుకు గాను వెరైటీగా పెళ్లి పత్రికను తయారు చేయించాలని భావించారు. హట్ టిక్కెట్టు రూపంలో పెళ్లి పత్రికను రూపొందించారు. 

జీవితంలో అన్ని పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని పంపారు. విద్యార్థులకు పరీక్షలు అంటే భయం ఉంటుంది. ఈ పరీక్షల భయాన్ని తొలగించేందుకు తాము ఈ ప్రయత్నాన్ని చేసినట్టుగా కొత్త జంట తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలనే ఓ పెళ్లి వేడుకలో పురాణాల్లో, సినిమాల్లో చూపినట్టుగా పుష్పక విమానంలో వధూవరులు రిసెప్షన్ వేదికపై అడుగుపెట్టారు.విజయవాడకు చెందిన నంబూరు నారాయణరావు అనే వ్యాపారి తన కొడుకు సందీప్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించారు. అయితే ఎవరూ చేపట్టనట్టుగా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన భావించాడు.

అనుకొన్నట్టుగానే నారాయణరావు తన కొడుకు కోడలు కోసం  పుష్పక విమానం లాంటి ప్రత్యేక రథాన్ని తయారు చేయించారు.  పెళ్లి రిసెప్షన్  వేదిక వద్దకు కొడుకు, కోడలును సందీప్ ఆయన భార్య సావర్యలను పుష్పక విమానం లాంటి రథంలో గ్రాండ్‌గా తీసుకొచ్చారు  క్రేన్ సహాయంతో 100 అడుగుల ఎత్తులో కొత్త వధూవరులను ఉంచి లేజర్ లైట్ల వెలుగులో  రిసెప్షన్ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios