Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా తరఫు లాయర్ కు షాక్

నిర్భ.య కేసు దోషి పవన్ గుప్తా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ కు ఢిల్లీ బార్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. తప్పుడు పత్రాలను సమర్పించి, విచారణకు హాజరు కానందుకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్ ను ఆదేశించింది.

Bar Council Notice To Nirbhaya Convict's Lawyer Over "Forged" Documents
Author
New Delhi, First Published Jan 19, 2020, 3:45 PM IST

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితుడు పవన్ కుమార్ గుప్తా తరఫున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ కు బార్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఫోర్జరీ చేసిన పత్రాలను సమర్పించి, విచారణకు హాజరు కాకపోవడంతో ఏపి సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సింగ్ కు ఢిల్లీ బార్ కౌన్సిల్ నోటీసు జారీ చేసింది.

తాము ఇచ్చిన నోటీసుకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని బార్ కౌన్సిల్ అతన్ని ఆదేశించింది. 2012లో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని పవన్ గుప్తా అంటూ తనకు ఉరి శిక్ష వేయరాదని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్ 19వ తేదీన డిస్మిస్ చేసింది.

Also Read: నిర్భయ కేసు దోషులను ఉరితీసేది ఇతనే

పవన్ గప్తా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఫోర్జరీ చేసిన పత్రాలను సమర్పించి, విచారణకు హాజరు కాకపోవడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ సింగ్ పై రూ.25 వేల జరిమానా విధించింది.

ఏపి సింగ్ పై తగిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ సురేష్ కుమార్ కైట్ ఢిల్లీ బార్ కౌన్సిల్ ను ఆదేశించారు దాంతో ఏపీ సింగ్ కు నోటీసు జారీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు నోటీసు అందుకున్న రెండు వారాల్లోగా తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు బార్ కౌన్సిల్ తెలిపింది.

Also Read: ఆ రేపిస్టులను క్షమించాలని అడగడానికి ఆమె ఎవరు: నిర్భయ తల్లి

నేరం జరిగినప్పుడు తాను మైనర్ ను అంటూ పవన్ గుప్తా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఆ పిటిషన్ పై జనవరి 20వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

Also Read: నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షలో మరో మెలిక: సుప్రీంకు పవన్ గుప్తా 

Follow Us:
Download App:
  • android
  • ios