భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భోపాల్ లోని తన ఇంట్లో ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి గురైంది. 53 ఏళ్ల ఆ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం తెల్లవారు జామున అఘాయిత్యం జరిగింది. 

లాక్ డౌన్ అమలవుతూ మనుషుల కదలికలపై తీవ్రమైన ఆంక్షలు ఉన్న పరిస్థితిలో ఆ సంఘటన చేసుకోవడంతో మధ్యప్రదేశ్ లో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు అంధురాలు. లాక్ డౌన్ కారణంగా ఆమె భర్త రాజస్థాన్ లోని సిరోహిలో చిక్కుకుపోయాడు. భోపాల్ లోని ఫ్లాట్ లో ఆమె ఒక్కతే ఉంటోంది. 

నిందితుడు ఆమె నివాసం ఉంటున్న రెండో అంతస్థుకు మెట్ల గుండా వెళ్లినట్లు భావిస్తున్నారు. బాల్కనీలో తెరిచి ఉన్న తలుపుల గుండా అతను ఫ్లాట్ లోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. 

పోలీసులు అత్యాచారం, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.