కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల వీడియో కలకలం సృష్టించింది. ఉద్యోగం ఇప్పిస్తానని జార్కిహోళి తనను మోసగించాడని సదరు యువతి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీడియో వెలుగులోకి వచ్చిన రోజునుంచి ఈ యువతి కనిపించకుండా పోయింది. 

ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని, ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యువతి తల్లిదండ్రులు మంగళవారం బెలగావి ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 363, 368, 343, 346, 354, 506ల కింద కేసు నమోదు చేశారు.

దీంతోపాటు యువతి తల్లిదండ్రులు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంట్లో తమ కూతురు ప్రమాదం ఉందని, ఆమె ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాసలీలల వీడియో బైటికొచ్చిన నాటినుంచి తమ కుమార్తెను చూడలేదని వాపోయారు. యువతి తండ్రి బెలగావిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

రాసలీలల కేసు : సీడీ విషయం ముందే తెలుసు.. ఐదు కోట్లకు డిమాండ్...

చివరిసారి తాము తమ కూతురితో మాట్లాడిన సంభాషణకూడా వెల్లడించారు. టీవీలో ఆ వీడియో ప్రసారం కాగానే నేను నా కుమార్తెకి కాల్‌ చేశానని.. దీని గురించి చెబుతూ..  

యువతి తండ్రి :  టీవీలో ఓ వీడియో వస్తుంది. దాంట్లో ఉన్న యువతి అచ్చం నీలాగే ఉంది. 
యువతి : ఆ వీడియో గురించి నాకేం తెలీదు. అందులో ఉంది నేను కాదు. అది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు. నేనే తప్పూ చేయలేదు. 
యువతి తండ్రి : నువ్వే తప్పు చేయకపోతే ఇంటికి రా.
యువతి : రాలేను..

అంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఓ సారి ‘నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించకండి’ అంటూ మెసేజ్ చేసిందని తెలిపారు. అదే ఆమెతో తమ చివరి సంభాషణ అని.. ఆ తర్వాత ఆమె మొబైల్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అయ్యిందని.. ఆ తర్వాత టీవీలో మరో వీడియో చూశామని, దాంట్లో తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొందని, దీంతో మేం బెల్గాంలో మిస్పింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాం అని తెలిపారు. 

ఇదిలా ఉంటే గతవారం యువతి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వీడియో స్టేట్ మెంట్ విడుదల చేసింది. ఇదే వీడియోలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. 

‘వీడియో ప్రసారంతో నా పరుపుపోయింది. జనాలు మా ఇంటికొచ్చి నా గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మా అమ్మానాన్న రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. నేను 3,4 సార్లు సూసైడ్‌ అటెంప్ట్‌ చేశాను’’ అని వీడియోలో పేర్కొంది. సిట్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.