Asianet News TeluguAsianet News Telugu

బాత్ టబ్ లో ఎంజాయ్ చేస్తున్న బుల్లి ఏనుగు.. వీడియో వైరల్..!

 దానికి ఎవరో వెనక నుంచి స్నానం చేపిస్తున్నట్లు కనపడుతోంది. వెంటనే... ఆ ఏనుగు టబ్ లోకి దిగి ఆ నీటిలోకి మునిగి  దాని సంతోషాన్ని తెలియజేసింది.

Baby elephant enjoys bath time in a tub filled with water. IFS officer shares old video ram
Author
First Published Apr 13, 2023, 9:36 AM IST

ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో పిల్లలు, పెద్దలు అందరూ నీటిలో ఆడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే... పిల్లలే కాదు.. మేం కూడా వాటర్ కనిపిస్తే అలానే ఆడుకుంటాం మని ఓ బుల్లి ఏనుగు నిరూపించింది.  వాటర్ టబ్ లో ఆడుకుంటూ.. ఓ బుల్లి ఏనుగు ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేయగా... వైరల్ గా మారింది.

 

ఈ వీడియోని దాదాపు 15లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. మొదట వీడియోలో... బుల్లి ఏనుగు.. నీటితో నిండి ఉన్న టబ్ లోకి దిగి వాటర్ ని ఆస్వాదిస్తోంది. దానికి ఎవరో వెనక నుంచి స్నానం చేపిస్తున్నట్లు కనపడుతోంది. వెంటనే... ఆ ఏనుగు టబ్ లోకి దిగి ఆ నీటిలోకి మునిగి  దాని సంతోషాన్ని తెలియజేసింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

ఈ వీడియోకి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios