రామ్ లల్లా మందిర నిర్మాణం పూర్తయిందని అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ మందిర స్వరూపాన్ని చూస్తే.. రామ్ లల్లా మందిరంలో ఒక గర్భగుడి, ఐదు మండపాలు ఉంటాయని వివరించారు. వీటి నిర్మాణం పూర్తయిందని వివరించారు.
Ayodhya: అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. విపక్షాలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతూ కీలక ఆరోపణలు చేస్తున్నాయి. నిర్మాణం పూర్తికాని ఆలయంలో ప్రాణ ప్రతిష్ట చేయడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుంటే.. ఇప్పుడు ఎందుకు అని నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం కీలక వివరణ ఇచ్చారు.
ఒక విధంగా చెప్పాలంటే రామ మందిరం పూర్తయిందని మిశ్రా అన్నారు. ‘మీరు మందిర స్వరూపాన్ని గమనించండి. రామ్ లల్లా మందిరంలో ఒక గర్భగుడి ఉంటుంది. ఐదు మండపాలు ఉంటాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. వీటి నిర్మాణం పూర్తయింది. అంటే.. రామ్ లల్లా మందిర నిర్మాణం పూర్తయింది’ అని మిశ్రా వివరించారు.
Also Read : School Holidays: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు పొడిగింపు.. అదనంగా మరో మూడు రోజులు
మందిరంలో గర్భగుడి ఉంటుందని, అందులోనే రామ్ లల్లా ఉంటారని చెప్పారు. గర్భగుడి నిర్మాణం పూర్తయిందని అన్నారు. రామ మందిరానికి సంబంధించి గర్భగుడి, ఐదు మండపాల నిర్మాణం పూర్తయిందని వివరించారు. ఇక పోతే మొదటి అంతస్తు నిర్మాణంలో ఉన్నదని, రెండో అంతస్తు నిర్మించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మొదటి అంతస్తులో రామ దర్బార్ ఉంటుందని, రెండో అంతస్తులో కేవలం అనుష్టాన్ కోసమేని తెలిపారు. కాబట్టి, ఒక విధంగా రామ మందిర నిర్మాణం పూర్తయిందని వివరించారు.
