Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో దారుణం... మహిళను గ్యాంగ్ రేప్ చేసి, చిత్రహింసలు పెడుతూ వీడియో తీసిన ముగ్గురు దుండగులు..

ముంబాయిలో 42 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. కత్తితో పొడిచారు. వెలుగుతున్న అగ్గి పుల్లలను విసిరేశారు. దీనిని వీడియో కూడా తీశారు. 

Atrocity in Mumbai... Three thugs took a video of gang-raping a woman and torturing her.
Author
First Published Dec 5, 2022, 4:56 PM IST

ముంబైలో దారుణం జరిగింది. 42 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా వీడియో తీశారు. ఇది నవంబర్ 30వ తేదీన జరగగా బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కుర్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ప్రధాని మోడీ, అమిత్ షా తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు!

బాధితురాలి ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై కుర్లా ప్రాంతంలో బోరి గార్డెన్ సమీపంలోని ఇందిరా నగర్‌లో నవంబర్ 30వ తేదీన తెల్లవారుజామున మహిళ తన ఇంట్లో నిద్రిస్తోంది. అయితే 5 గంటల ప్రాంతంలో తలుపుకొట్టిన చప్పుడు వినిపించడంతో బయటకు వెళ్లి చూసింది. దీంతో బబ్లూ, వసీం, మున్నా అనే ముగ్గురు నిందితులు బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బాధితురాలిని దుర్భాషలాడి చేతులు, కాళ్లు కట్టేశారు. తరువాత కట్లు విప్పుతున్న సమయంలో నిందితుల్లో ఒకరు ఆమె శరీరంపై వెలుగుతున్న అగ్గిపుల్లలను విసిరేశాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. 

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం.. డిసెంబర్ 8న ఆంధ్రా తీరాన్ని తాకే అవకాశం

వారు అక్కడితో ఆగలేదు. మహిళపై దారుణంగా దాడి చేశారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగిక వేధింపులను తమ మొబైల్‌ కెమెరాలో వీడియో తీశారు. అనంతరం మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అదే సమయంలో వారిలో ఒకరు ఆమె శరీరంపై కత్తితో పొడిచాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు.

లాలు యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. నాన్న, అక్క ఇద్దరూ క్షేమం: తేజస్వీ యాదవ్

అనంతరం మహిళ ఎలాగోలా కుర్లా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ముంబైలోని భాభా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె రెండు రోజుల పాటు చికిత్స పొంది అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.  బాధితురాలి వాంగ్మూలం ఆధారం, ముగ్గురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం సెక్షన్లు 376 (రేప్), 376 (3) (గ్యాంగ్‌రేప్), 377 (అసహజ నేరాలు), 452, 323, 504, 34 కింద కేసు నమోదు చేశారని ‘టైమ్స్ నౌ’ కథనం నివేదించింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios