Asianet News TeluguAsianet News Telugu

అటల్ టన్నెల్‌లో యాక్సిడెంట్లు: ప్రారంభించిన 72 గంటల్లో 3 రోడ్డు ప్రమాదాలు

అటల్ టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.లే-మనాలీ మధ్య 46 కి.మీ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన అటల్ టన్నెల్ ను  ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు.

Atal tunnel: 3 accidents in 72 hours as drivers rush in to race for selfies
Author
New Delhi, First Published Oct 6, 2020, 2:12 PM IST

న్యూఢిల్లీ: అటల్ టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.లే-మనాలీ మధ్య 46 కి.మీ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన అటల్ టన్నెల్ ను  ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త టూరిస్ట్ ప్రాంతంగా ఈ టన్నెల్ మారింది. ఈ టన్నెల్ ప్రారంభమైన మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు నెలకొందని ఓ వార్తా పత్రిక తెలిపింది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) జిల్లా అధికారులు ఈ టన్నెల్ కారణంగా కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వందలాది మంది పర్యాటకులు , వాహనదారులు ఈ సొరంగమార్గంలో రేసింగ్ తో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.ఈ సొరంగ మార్గం ప్రారంభించిన అక్టోబర్ మూడో తేదీన ఒక్కరోజే మూడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.

ఈ సొరంగమార్గంలో ప్రయాణం చేసే సమయంలో పర్యాటకులు, వాహనదారులు ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్పీలు తీసుకొంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ కేపీపురుషోత్తమన్ చెప్పారు.ఈ టన్నెల్ లో వాహనాలను నిలిపేందుకు ఏ ఒక్కరికి కూడ అనుమతి లేదని అధికారులు తెలిపారు.

టన్నెల్ లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులను నియమించాలని బీఆర్ఓ అధికారులు కోరారు.  అటల్ సొరంగంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా వాహనాలను నడపడకుండా చర్యలు తీసుకొన్నామని ఎస్పీ గౌరవ్ సింగ్ చెప్పారు.

ఈ టన్నెల్ లో ఉదయం 9 నుండి 10 గంటలు, సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు ప్రజలకు అనుమతిని  నిరాకరిస్తున్నారు.సొరంగమార్గంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి డాక్టర్ రామ్ లాల్ మర్కండా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios