షెల్టర్ హోమ్ లో 39 మంది బాలికలపై రేప్: విస్తుపోయే విషయాలు

First Published 28, Jul 2018, 12:05 PM IST
At Bihar Shelter Home Where Girls Were Raped, 5 More Cases Confirmed
Highlights

బీహార్ లోని షెల్టర్ హోమ్ లో అత్యాచారాలకు గురైన బాలికల సంఖ్య 34కు పెరిగింది. షెల్టర్ హోమ్ లో ఉంటున్న 42 మంది బాలికల్లో 29 మంది అత్యాచార బాధితులు ఉన్నట్లు ఇంతకు ముందు తెలిసింది.

పాట్నా: బీహార్ లోని షెల్టర్ హోమ్ లో అత్యాచారాలకు గురైన బాలికల సంఖ్య 34కు పెరిగింది. షెల్టర్ హోమ్ లో ఉంటున్న 42 మంది బాలికల్లో 29 మంది అత్యాచార బాధితులు ఉన్నట్లు ఇంతకు ముందు తెలిసింది. అయితే, మరో ఐదుగురిపై కూడా అత్యాచారం జరిగినట్లు తాజాగా వెలుగు చూసింది. 

బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలోని షెల్టర్ హోమ్ లో నెలల తరబడి బాలికలపై అత్యాచారాలు జరిగిన విషయం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 11 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో పది మందిని అరెస్టు చేశారు. 

సంఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించారు. సిబిఐ పది మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. పలువురు బాలికలతో మాట్లాడిన తర్వాత ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్స్ సమర్పించిన నివేదిక వల్ల ఈ సంఘటన వెలుగు చూసింది. 

ఈ షెల్టర్ హోమ్ ను ప్రభుత్వేతర సంస్థ (ఎన్డీవో) నడిపిస్తోంది. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి బాలికలను సమీపంలోని జిల్లాల్లోని హోమ్స్ కు తరలించారు. ఎన్డీవోను నడుపుతున్న బ్రజేష్ ఠాకూర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

ఓ మైనర్ బాలిక శవాన్ని హోమ్ ఆవరణలో పాతిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. సోమవారం ఆవరణలో తవ్వకాలు జరిపారు. అయితే, బాలిక శవమేదీ కనిపించలేదు. ఈ సంఘటనలో ఇద్దరు మంత్రుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించాలని బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.

మంత్రి భర్త మంజు వర్మ తరుచుగా హోమ్ కు వస్తుండేవాడని ఆరోపణలు వచ్చాయి. 

loader