రేప్ చేయబోయిన తండ్రిని నరికేసి చంపింది

First Published 24, May 2018, 6:31 PM IST
Assam woman axes father as he tried to rape her, buries him in backyard pit
Highlights

తనపై అత్యాచారం చేయబోయిన తండ్రిని పాతికేళ్ల మహిళ హత్య చేసింది.

గౌహతి: తనపై అత్యాచారం చేయబోయిన తండ్రిని పాతికేళ్ల మహిళ హత్య చేసింది. ఈ సంఘటన అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో జరిగింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 71 ఏళ్ల వ్యక్తి శవాన్ని పోలీసులు 15 అడుగుల లోతు గుంతలోంచి మంగళవారం వెలికి తీశారు. ఈ సంఘటనకు సంబంధించి ఆ మహిళతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు 

మహిళపై హత్యానేరం కింద కేసు నమోదు చేయగా, ఆమె తల్లిపై, ఇతరులపై సాక్ష్యాలు దాచిపెట్టినందుకు కేసులు పెట్టారు. మార్చి 3వతేదీ రాత్రి 11 గంటలకు తనపై అత్యాచారం చేయబోయాడని, తాను ప్రతిఘటించడంతో గొడ్డలి తీసుకున్నాడని, తాను గొడ్డలిని లాక్కుని అతన్ని చంపానని మహిళ చెప్పింది.

ఆ తర్వాత సవాన్ని మరో గదిలో దాచి పెట్టారు. అందుకు తల్లి, అన్నయ్య సాయపడ్డారు మర్నాడు ఉదయం వారితో ఇద్దరు సిస్టర్స్ వారితో చేరారు. 

మూడు రోజుల పాటు శవాన్ని ప్లాస్టిక్ సంచుల్లో పెట్టారు. ఆ తర్వాత గుంత తవ్వి మార్చి 7వ తేదీన పాతిపెట్టారు. కుటుంబ సభ్యులు మే 11వ తేదీన మిస్సింగ్ కేసు పెట్టారు. దాంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. 

loader