పడక గదిలో ఓ మహిళతో గడిపి.. దాన్నంతటినీ వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కాగా.. ఆ కీచక ప్రొఫెసర్ ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసోంలోని బార్పేట జిల్లా పాఠశాల గ్రామానికి చెందిన ద్రుభజీత్ చౌదరి దిబ్రూఘడ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. పడకగదిలో ఓ మహిళతో కలిసి ఉన్న వీడియోను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోర్న్ వెబ్‌‌సైట్‌లో పోస్టు చేశారు. దీంతో పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. 

ప్రొఫెసరు ఇంట్లో నుంచి కంపాక్ట్ డిస్క్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని దిబ్రూఘడ్ డీఎస్పీ శ్రీజిత్ చెప్పారు. ఈ అశ్లీల వీడియోను మూడేళ్ల క్రితం చిత్రీకరించానని చెప్పడంతో అతన్ని అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు. అశ్లీల చిత్రాలు షూట్ చేసిన కీచక ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ పోస్టుగ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.