కాన్పూరు: ఓ ప్రముఖ క్లబ్ మాజీ డైరెక్టర్ 25 ఏళ్ల మోడల్ పై అత్యాచారం చేశాడు. తన సహాయకులు ఐదుగురి ముందు అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాన్పూర్ లోని ఓ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన అస్సాం మోడల్ పై ఆ ఆతను అత్యాచారం చేశాడు. 

నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు దాడి చేశారు. అయితే, అప్పటికే నిందితుడు పారిపోయాడు. 

సంఘటన జరిగిన భవనంలో ఎకో స్పోర్ట్స్, క్రెటా కార్లు కనిపించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను మోడల్ ను అని, అంతేకాకుిండా అస్సామ్ మాజీ మిస్ ను అని బాధితురాలు పోలీసులకు చెప్పింది. 

మాంధ్నాలోని జంగిల్ వాటర్ వరల్డ్ ఏర్పాటు చేసిన రంగ్ బర్సే పూల్ పార్టీలో పాల్గొనడానికి మోడల్ మార్చి 13వ తేదీన కాన్పూర్ వచ్చింది. మార్చి 15వ తేదీన ప్రదర్శన ఇవ్వడానికి ఈవెంట్ ఆర్గనైజర్ శాంక్షమ్ సాహు ఆమెను బుక్ చేశాడు. ఇక్బాల్ అనే అతను ఆమెకు టికెట్ బుక్ చేశాడు. 

పోలీసుల కథనం ప్రకారం... మార్చి 15వ తేదీన కార్యక్రమం ముగిసిన తర్వాత వ్యాపారి అమిత్ అగర్వాల్ బాధితురాలని బిల్డర్ సమీర్ అగర్వాల్ భవనానికి తీసుకుని వెళ్లాడు. ఆదివారం రాత్రి భవనంలోంచి యువతి కేకలు వినిపించడంతో సమీపంలో నివసించేవారంతా అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు.