గౌహతి: అస్సాంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురిపై అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తి అస్సాంలోని దిబ్రుగడ్ కోర్టు ఆవరణలో భార్యను హత్య చేశాడు. భార్య, అతను విచారణకు అతను కోర్టుకు హాజరయ్యాడు. 

ఆ సమయంలో పదునైన ఆయుధంతో భార్యను కొట్టాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తాను కూతురిపై అత్యాచారం చేయలేదని, తనపై తన భార్య తప్పుడు కేసు బనాయించిందని అన్నాడు. 

బెయిల్ పై విడుదలైన తర్వాత తనను ఇంటికి కూడా రానీయలేదని, అందుకే ఆమెను చంపేశానని చెప్పాడు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. డేకా అనే వ్యక్తి తన భార్య రిటా నహర్ డేకాను డిబ్రుగర్ జిల్లా, సెషన్స్ కోర్టు రూమ్ వెలుపల హత్య చేశాడు. 

కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై పోలీసులు 9 నెలల క్రితం డేకాపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం భార్యాభర్తలిద్దరు కోర్టుకు వచ్చారు. కోర్టు రూం వెలుపల బెంచీపై ఇద్దరు కూర్చున్నారు. 

అక్కడే అతను భార్యపై దాడి చేశాడు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు .