Asianet News TeluguAsianet News Telugu

ఉపాధి కోసం ఆ పనిలో సెక్స్ వర్కర్లు...

చాలా మంది సెక్స్ వర్కర్లు గతంలో మాదిరిగా ఆ పనిచేయలేకపోయారు. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు.

ASHA officials helped Sex Workers to earn money
Author
Hyderabad, First Published Jan 25, 2021, 11:51 AM IST

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. చాలా మంది సెక్స్ వర్కర్లు గతంలో మాదిరిగా ఆ పనిచేయలేకపోయారు. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు.

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో వారి వ్యాపారం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో కుటుంబ పోష‌ణ భారంగా మారింది. నాసిక్‌లోని సెక్స్ వ‌ర్క‌ర్లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఆశా అధికారులు గుర్తించారు. వారికి జీవ‌నోపాధి క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

అనుకున్న‌దే త‌డువుగా.. సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు ఆభ‌ర‌ణాల త‌యారీలో శిక్ష‌ణ ఇచ్చారు. ఆ త‌ర్వాత సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు ఆర్థిక సాయం చేసి ఆభ‌ర‌ణాల త‌యారీలో నిమ‌గ్న‌మ‌య్యేలా చేశారు. వారు త‌యారు చేసిన ఆభ‌ర‌ణాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

ఈ సంద‌ర్భంగా సెక్స్ వ‌ర్క‌ర్లు మాట్లాడుతూ.. తాము త‌యారు చేసిన ఆభ‌రణాల‌కు మంచి డిమాండ్ ఉంద‌న్నారు. త‌మ‌ను ప్ర‌జ‌లు కూడా ఆద‌రిస్తున్నార‌ని, ఇది త‌మ భ‌విష్య‌త్‌కు ఎంతో మేలు చేస్తుంద‌న్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios