Asianet News TeluguAsianet News Telugu

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: మతాన్ని కూడా వదలడం లేదు అధికారి సమీర్ వాంఖడే..!

తాజాగా ఈ అంశంపై ఆయ‌న స్పందించారు. త‌న‌పై దురుద్దేశపూర్వ‌కంగా దాడి జ‌రుగుతోంద‌ని, త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు

Aryan Khan Case Officer Alleges Targeted Over "Dead Mother, Her Religion"
Author
Hyderabad, First Published Oct 25, 2021, 2:51 PM IST

ముంబయి డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఈ కేసులో ఇరుక్కోవడంతో.. ఈ కేసు పట్ల అందరికీ ఆసక్తి పెరిగింది. కాగా.. ఈ కేసు విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే ముడుపులు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఈ అంశంపై ఆయ‌న స్పందించారు. త‌న‌పై దురుద్దేశపూర్వ‌కంగా దాడి జ‌రుగుతోంద‌ని, త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ముంబై పోలీస్‌ చీఫ్‌ హేమంత్‌ నాగ్రాలేను ఆశ్రయించి త‌న‌పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. త‌న‌పై చేస్తున్న ఫిర్యాదులు నిరాధార‌మైన‌వ‌ని అందులో వెల్ల‌డించారు.

Also Read: Aryan Khan: ఆట ఇప్పుడే మొదలైంది.. వెయిట్ అండ్ వాచ్.. : ఎంపీ సంజయ్ రౌత్.. శామ్ డిసౌజా ప్రస్తావన
“ NCB Cr No. 94/2021 (ఆర్యన్ ఖాన్ కేసు)లో గుర్తు తెలియని వ్యక్తులు నాపై తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. నాపై చట్టపరమైన చర్యలను తీసుకునేలా, కేసు విచార‌ణ ఆగిపోయేలా కుట్ర చేస్తున్నారని నా దృష్టికి వ‌చ్చింది. ఎవ‌రినో నేను బెదిరించిన‌ట్టుగా మీడియాలో వార్తలు కూడా వచ్చాయి” అని చెప్పిన స‌మీర్ వాంఖ‌డే త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌వ‌ద్ద‌ని కోరారు. త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వారిపై చర్యల కోసం ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ ముఠా జైన్‌కు ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని నివేదించాన‌ని వాంఖడే తెలిపారు. అంతేకాదు.. చనిపోయిన తన తల్లిని, తన మతాన్ని కూడా వదలడం లేదని..  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also read: ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.. ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ దర్యాప్తు

ఆర్య‌న్ ఖాన్ కేసులో ఆర్థిక ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మీర్ వాంఖ‌డేపై స్వ‌తంత్ర సాక్షిగా ఉన్న ప్ర‌భాక‌ర్ సెయిల్ ఆదివారం సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న‌తో ఖాళీ కాగితంపై సంత‌కం చేయించుకున్నార‌ని ఆరోపించాడు. షారూఖ్ ఖాన్ నుంచి రూ. 25 కోట్లు డిమాండ్ చేశార‌ని అఫిడ‌విట్‌ను నార్కోటిక్ కోర్టులో స‌మ‌ర్పించాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios