Asianet News TeluguAsianet News Telugu

జైట్లీ, సుష్మా స్వరాజ్ లకు పద్మ విభూషణ్: పీవీ సింధుకు పద్మభూషణ్

సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. క్రీడల విభాగంలో పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఐదుగురు తెలుగువాళ్లకు పద్మ అవార్డులు దక్కాయి.

Arun Jaitley and Sshma swarja honoured with Padma Vibhusan, PV Sindhu gets Padma Bhusan
Author
New Delhi, First Published Jan 25, 2020, 9:57 PM IST

న్యూఢిల్లీ: భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులకు మొత్తం 171 మందిని ఎంపిక చేసింది. 

ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. మరణానంతరం జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, విశ్వేశ్వతీర్థ స్వామీజలకు పద్మవిభూషణ్ ప్రకటించింది. పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులను పద్మ అవార్డులు దక్కాయి. క్రీడా విభాగంలో పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి చిన్నతల వెంకట్ రెడ్డి (వ్యవసాయం), విజయసారథి శ్రీభాష్యం (విద్య, సాహిత్యం), ఏపీ నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దలవాయి చలపతిరావు (కళలు)లను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

పద్మ విభూషణ్ కు ఎంపికైనా ఏడుగురు

జార్జి ఫెర్నాండెజ్ (బీహార్), అరుణ్ జైట్లీ (ఢిల్లీ), అనిరుధ్ జగ్ నౌద్ మిశ్రా (మార్షియస్), ఎంసీ మేరీకోమ్ (మణిపూర్), క్రీడలు, చెన్నూలాల్ మిశ్రా (ఉత్తరప్రదేశ్), కళలు, సుష్మా స్వరాజ్ (ఢిల్లీ), విశ్వేశ్వతీర్థ స్వామీజీ (కర్ణాటక)

పద్మభూషణ్ కు ఎంపికైన 16 మంది

ఎం. ముంతాజ్ (కేరళ), ఆధ్యాత్మికం, సయ్యద్ మౌజం అలీ (బంగ్లాదేశ్) మరణానంతరం, ముజఫర్ హుస్సేన్ బేగ్ (జమ్మూ కాశ్మీర్), అజయ్ చక్రవర్తి (బెంగాల్), కళలు, మనోజ్ దాస్ (పుదుచ్చేరి), సాహిత్యం, విద్య, బాలకృష్ణ దోశి (గుజరాత్), కృష్ణమ్మల్ జగన్నాథన్ (తమిళనాడు) సామాజిక సేవ, ఎస్సీ జామీర్ (నాగాలాండ్), అనిల్ ప్రకాశ్ జోషి (ఉత్తరాఖండ్) సామాజిక సేవ, సేరింగ్ లండల్ (లద్ధాఖ్), వైద్యం, ఆనంద్ మహీంద్ర (మహారాష్ట్ర) వాణిజ్యం, పరిశ్రమలు, పీవీ సింధు (క్రీడలు), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (కేరళ) ప్రజా సంబంధాలు (మరణానంతరం), మనోహర్ పారికర్ (గోవా), మరణానంతరం, జగదీశ్ సేథ్ (అమెరికా), విద్య, సాహిత్యం, వేణు శ్రీనివాసన్ (తమిళనాడు), వాణిజ్యం, పరిశ్రమలు

Follow Us:
Download App:
  • android
  • ios