ప్రియుడిపై పెంచుకున్న మోజుతో.. భర్తను అంతమొందించాలని పథకం వేసింది ఓ వివాహిత. కాగా.. ఆ ప్లాన్ బెడిసికొట్టి.. భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఆర్మీ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వృత్తి రీత్యా అతను ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి వీలుపడేది కాదు. దీనిని అదునుగా చేసుకున్న అతని భార్య.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిస్తే చంపేస్తాడనే భయంతో.. ప్రియుడితో కలిసి భర్తనే అంతమొందించాలని అనుకుంది.

ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి పథకం పన్ని.. ఒక ఆయింట్ మెంట్ లో విషపదార్థాలు కలిపించింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన భర్తకి ఆ ఆయింట్ మెంట్ ఇచ్చి.. దానిని పురుషాంగానికి రాసుకోవాలి.. అలా చేస్తే లైంగికాసక్తి పెరుగుతుందని సూచించింది. ఆమె చెప్పినట్లుగానే అతను ఆ ఆయింట్ మెంట్ రాసుకున్నాడు. అయితే.. జననాంగాలు విపరీతంగా మంటపుట్టడంతో.. వెంటనే వెళ్లి వైద్యుడిని కలిశాడు.

ఆ మందుని పరీక్షించిన వైద్యుడు.. అందులో విషపదార్థాలు కలిసినట్లు గుర్తించి అతనికి వివరించారు. అదృష్టవశాత్తు  ప్రాణాలతో బయటపడ్డారని వైద్యుడు చెప్పాడు. దీంతో...అతను వెంటనే.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్మీ మేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.