ఇంటికి వెళ్తున్న జవానును కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

First Published 14, Jun 2018, 6:47 PM IST
Army jawan kidnapped by terrorists in Jammu and Kashmir
Highlights

ఇంటికి వెళ్తున్న జవానును కిడ్నాప్  చేసిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు బరితెగించారు.. సెలవులపై ఇంటికి వెళ్తున్న ఓ సైనికుడిని కిడ్నాప్ చేశారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఔరంగజేబు అనే జవాను సెలవులపై ఇంటికి వెళ్తుండగా పూంఛ్ జిల్లాలో తీవ్రవాదులు ఆయన్ను అడ్డగించి అపహరించుకుపోయారు.. కరుడుగట్టిన హిజ్బుల్ ఉగ్రవాది సమీర్ టైగర్ ఎన్‌కౌంటర్‌లో ఔరంగజేబు కీలకపాత్ర పోషించారు.. జవాన్ కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఆర్మీ, బీఎస్ఎఫ్, పోలీసు బలగాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. కాగా, గతేడాది మే నెలలో కూడా ఒక సైనికుడిని కిడ్నాప్ చేసిన టెర్రిరిస్టులు ఆయనను అత్యంత దారుణంగా హతమార్చారు.. తర్వాతి రోజు తూటా గాయాలతో జల్లెడగా మారిన జవాను మృతదేహాన్ని భారత సైన్యం గుర్తించింది. ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.

loader