చత్తీస్ ఘడ్ లో మరో ఎన్కౌంటర్, ముగ్గురు మావోల మృతి

First Published 15, Jun 2018, 3:15 PM IST
another encounter in chhattisgarh, 3 maoist dead in police firing
Highlights

భారీగా పట్టుబడ్డ ఆయుధాలు.

మవోయిస్టులకు భద్రతా బలగాలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఈ మద్య కాలంలో జరిగిన అనేక ఎన్కౌంటర్లలో మావోలు కోలుకోలేని విధంగా దెబ్బతినగా ఇవాళ మరోసారి పోలీసుల కాల్పల్లో ముగగ్గురు మావోలు మఈతి చెందారు. ఈ ఎన్కౌంటర్ చత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులు, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కోసం సుక్మా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం తెలంగాణ సరిహద్దులోని చిత్రగుఫా ఏరియాలో కూంబంగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో వారిని లొంగిపొమ్మని పోలీసులు కోరినప్పటికి వినకుండా కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చింది.

ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంత మంది మావోలకు గాయాలయ్యాయని, వారు అలాగే అడవిలోకి పారిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. మావోలు ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను వదిలివెళ్లగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

loader