హైద‌రాబాద్ స‌హా దేశంలోని టాప్ ఆస్ప‌త్రుల‌ను టార్గెట్ చేసిన సూడాన్ హ్యాక‌ర్లు..

Hyderabad: అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రాడ్‌వేర్ ప్రకారం 'Anonymous Sudan' అనేది  సూడాన్ కు చెందిన రాజకీయ ప్రేరేపిత హ్యాకర్ల సమూహం. డిస్ట్రిబ్యూటెడ్ రిజెక్షన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) దాడులను ఇది నిర్వహిస్తుంది. మార్చి 2023 లో, ఈ బృందం ఫ్రాన్స్ ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు,  విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డింది.
 

Anonymous Sudan hackers target top hospitals in various cities including Hyderabad RMA

Sudan hackers targets Hyderabad top hospitals: భార‌త్ స‌హా ప‌లు దేశాల కీల‌క సంస్థ‌ల‌పై సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డిన  'Anonymous Sudan' మ‌రోసారి దేశంలోని ప‌లు కీల‌క సంస్థ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సారి దేశంలోని టాప్ ఆస్ప‌త్రులు, ముఖ్యంగా హైద‌రాబాద్ కేంద్రంగా న‌డుస్తున్న ఆస్ప‌త్రులను టార్గెట్ చేసింద‌నీ, త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని యూఎస్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఒక సెక్యూరిటీ సంస్థ హెచ్చ‌రించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. గతంలో భారత ఓడరేవులు, విమానాశ్రయాలపై దాడులు చేసిన ఇస్లామిక్ అనుకూల సంస్థ  'Anonymous Sudan'  హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ప్రముఖ ఆస్పత్రులు, హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లను లక్ష్యంగా చేసుకుంది. వీటిలో నగరంలోని కొన్ని అగ్రశ్రేణి కార్పొరేట్, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు ఉన్నాయి. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రాడ్‌వేర్ ప్రకారం 'Anonymous Sudan' అనేది  సూడాన్ కు చెందిన రాజకీయ ప్రేరేపిత హ్యాకర్ల సమూహం. డిస్ట్రిబ్యూటెడ్ రిజెక్షన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) దాడులను ఇది నిర్వహిస్తుంది. మార్చి 2023 లో, ఈ బృందం ఫ్రాన్స్ ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు,  విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డింది.

ఇదే విష‌యం గురించి నిపుణులు మాట్లాడుతూ.. ఇది హ్యాకింగ్ కాదనీ, అనేక ప్రదేశాల నుండి బహుళ వినియోగదారులు ఒకేసారి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం వల్ల భారీ ట్రాఫిక్‌కు దారితీస్తుందనీ, చివరకు నిజమైన వినియోగదారులకు సేవలు అంద‌కుండా చేస్తుంద‌ని చెబుతున్నారు. గతంలో ఇదే గ్రూప్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కొచ్చిన్, గోవా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయాల వెబ్‌సైట్‌లను టార్గెట్ చేసింది. దీని దాడుల‌కు గురైన వాటిలో  ఐఆర్సీటీసీ, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లు కూడా ఉన్నాయి. సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఫాల్కన్ ఫీడ్స్ ఇదే విష‌యం గురించి చెబుతూ.. "'Anonymous Sudan' హ్యాక్టివిస్ట్ గ్రూప్ భారతదేశంలోని ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఆసుపత్రులపై, ఆరోగ్య బృందాలపై దాడులు చేయడం ఎప్పుడూ ఖండించదగినదే. భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ ఇనిస్టిట్యూట్, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నార‌ని" పేర్కొంది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు డాక్టర్ శ్రుతి మంత్రి మాట్లాడుతూ.. "కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, తరువాత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కీలకమైన మౌలిక సదుపాయాలుగా అభివృద్ధి చెందాయి. ఆరోగ్య సంరక్షణ రంగం జీవిత-క్లిష్టమైన సేవలను అందిస్తూనే ఉంది.  వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించి నెట్ వ‌ర్క్ చేయబడిన ఇంటెలిజెంట్ రోబోటిక్ వ్యవస్థలను ఉపయోగించి, బహుళ ఐఓటి పరికరాలతో తయారు చేయబడింది. సైబర్ అటాకర్లు ఈ వ్యవస్థలలోని బలహీనతను ఉపయోగించుకుంటారని" తెలిపారు. రోగుల గోప్యతకు భంగం కలిగించే మాల్వేర్ నుంచి డీడీఓఎస్ దాడులు, సోషల్ ఇంజినీరింగ్ దాడులు, ఇన్సైడర్ బెదిరింపు, మోసాలు, కుంభకోణాల వరకు ఈ సైబర్ దాడులుగా ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ కోసం, సైబర్ దాడులు ఆర్థిక నష్టం, వ్య‌క్తిగ‌త‌ గోప్యత ఉల్లంఘనకు మించిన ప్రభావాలను కలిగిస్తాయి. రాన్సమ్ వేర్ కేసుల్లో రోగి డేటాను కోల్పోవడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనీ, ఇది డీడీఓఎస్ దాడిగా ఆమె పేర్కొన్నారు.

ప్రమాదాలను తగ్గించడానికి, సైబర్ దాడుల ప్రభావాలను తగ్గించడానికి ఆస్పత్రులు, వైద్య పరికరాల తయారీదారులు, చట్ట అమలు సంస్థలు, ప్రభుత్వాలు (రాష్ట్ర, స్థానిక, కేంద్ర) సహా వివిధ భాగస్వాముల మధ్య వనరుల సమీకరణ-సమన్వయాన్ని అభివృద్ది చేయాల్సిన అవ‌స‌రాన్ని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios