Asianet News TeluguAsianet News Telugu

బకెట్‌లో మనిషి చేయి... పరుగులు తీసిన జనం

జార్ఖండ్‌లో మనిషి చేయి బకెట్‌లో లభించడం కలకలం రేపింది. బారియాటు ప్రాంతంలో బకెట్‌లో చేయి కినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

Amputated hand found in bucket in Ranchi
Author
Ranchi, First Published Sep 6, 2020, 6:11 PM IST

జార్ఖండ్‌లో మనిషి చేయి బకెట్‌లో లభించడం కలకలం రేపింది. బారియాటు ప్రాంతంలో బకెట్‌లో చేయి కినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి బకెట్‌లో లభించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేయి ఒక క్యాన్సర్ పేషంట్‌దని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

పరీక్షకు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. అయితే ఆ తెగిన చేయి ఆసుపత్రి నుంచి బకెట్‌లోకి ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు రాంచీ ఎస్పీ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios