డీఎంకేలో అన్నదమ్ముల పోరు తారా స్థాయికి చేరుకుంది.  పార్టీ నాయకత్వంలో అన్న అళగిరి వేలు పెట్టడాన్ని ముందు నుంచి సహించలేకపోతున్న స్టాలిన్.. స్వయంగా తమ్ముడి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నప్పటికీ... స్టాలిన్ మాత్రం ససేమిరా అంటున్నారు.

దీంతో అళగిరి పోరుకు సిద్ధమయ్యారు. ఇవాళ లక్షమంది మద్ధతుదారులతో చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మెరీనా బీచ్‌లోని తండ్రి సమాధి వద్దకు అళగిరి వెళ్లనున్నారు. అయితే అళగిరి రాజకీయంగా అంతగా చురుకుగా లేరు.. పైగా కుటుంబసభ్యుల మద్ధతు కూడా లభించలేదు. ర్యాలీకి లక్షమంది వస్తారా అన్నది కూడా అనుమానమే.

అయితే అళగిరి ర్యాలీని విజయవంతం చేయడానికి డీఎంకే వ్యతిరేక శక్తులు  తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ర్యాలీకి వచ్చిన  స్పందనను బట్టి అళగిరి తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.