న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్రదాడులకు ఆల్‌ఖైదా ప్రణాళికలను రచించిందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థలపై కొంత కాలంగా భారత ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు ప్రతీకారంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలకు అల్టిమేటం జారీ చేశాయి.

పాక్ సరిహద్దుల్లోని పఠాన్‌కోట్  వైమానిక స్థావరంపై 2016లో భారీ ఉగ్రదాడి జరిగింది.  ఇదే తరహా దాడికి  ఆల్‌ఖైదా వ్యూహలు రచించినట్టుగా నిఘా వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. పాక్ ప్రేరేపిత సంస్థ జైషే మహ్మద్‌నెు భారత్ అన్ని రకాలుగా తిప్పికొట్టింది.

భారత్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఆల్‌ఖైదాకు జైషే మహ్మద్  సహకరిస్తోందని నిఘా వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమాచారం ఆధారంగా నిఘా వర్గాలు భద్రతా బలగాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంది.