‘‘అక్బర్ గొప్ప రాజు కాదు’’

Akbar wasn't great, only Maharana Pratap was: Yogi Adityanath
Highlights

యూపీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అక్బర్‌ కంటే మహారాణా ప్రతాప్‌ చాలా గొప్ప చక్రవర్తి’ అని పేర్కొన్నారు. గురువారం లక్నో ఐఎమ్‌ఆర్‌టీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘మహారాణా ప్రతాప్‌ గొప్పవీరుడు, శౌర్యవంతుడు. వేరేమతానికి చెందిన వాడైన విదేశీయుడు అక్బర్‌ చక్రవర్తిత్వాన్ని ఆయన ఒప్పుకోలేదు. అంతేకాక ఆ విషయాన్ని నేరుగా అక్బర్‌ రాయబారితోనే చెప్పగలిగాడు. మహారాణా ప్రతాప్‌ రాజ్యాన్ని కోల్పోయి దేశాలు పట్టుకుతిరిగినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోలేదు. అందుకే విదేశియుడైన అక్బర్‌ను చక్రవర్తిగా ఒప్పుకోలేదు’

‘ కానీ దురదృష్టం కొద్ది మన చరిత్రకారులు ఇలాంటి అంశాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఒక తరం మొత్తం ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కొల్పోయింది. మహారాణా ప్రతాప్‌ జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శదాయకం. ఆయన జీవితం నుంచి నేటి యువత శౌర్యం, ప్రతాపం వంటి లక్షణాలను అలవర్చుకోవా’లని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగి ‘యువశౌర్య’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో మహారాణా ప్రతాప్‌ జీవితం, ధైర్యసాహసాల గురించి వ్యాసాలు, కథలను పొందుపర్చారు.

loader