విమానంలో చార్జీలతొ పోలిస్తే ఆటో రిక్షాల చార్జీలే ఎక్కువగా ఉన్నాయట.ఈ మాటలు అన్నది ఎవరో అల్లాటప్పా వ్యక్తులో, విమాన చార్జీల గురించి అవగాహన లేని వ్యక్తో కాదు. కేంద్ర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్వయంగా చెప్పిన మాటలివి. ఇందుకోసం ఆయన ఓ ఉదాహరణను కూడా వివరించారు.

విమాన చార్జీల గురించి మాట్లాడుతూ మంత్రి జయంత్ సిన్హా ఇలా పేర్కొన్నాడు.'' ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ఎక్కడికైనా ఆటోలో ప్రయాణించాలంటే కిలోమీటర్ కు రూ. 10 చెల్లించాల్సి వస్తుంది. అంటే ఆటోవారు మనిషికి ఐదు రూపాలయలు చార్జ్ చేస్తున్నట్లు. కానీ విమానంలో ప్రయాణానికి కిలోమీటర్ కు కేవలం రూ.4 లే ఖర్చవుతుంది. అంటే ఆటోరిక్షా కంటే విమాన ప్రయానం చౌకే కదా...'' అంటూ తన వివరణ ఇచ్చారు.

 గతంలోనే జయంత్ సిన్హా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇండోర్ నుండి డిల్లీకి వెళ్లడానికి విమానంలో కిలోమీటర్ కు రూ.5 మాత్రమే ఖర్చవుతుందని, కానీ ఆటోల్లో కనీస ధరలే రూ.8  నుండి రూ.10 వరకు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విమాన చార్జీలపై మంత్రి అలాంటి వ్యాఖ్యలే చేశారు.