బాత్రూంలో శృంగారం చేయాలంటూ ఓ భర్త తన భార్యను వేధించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో... దారుణంగా కొట్టి.. తను అనుకున్నట్లుగానే ఆమెతో బాత్రూంలో కోరిక తీర్చుకున్నాడు. రోజూ భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేకపోయిన ఆ యువతి... పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోమతిపూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువతికి నాలుగు నెలల క్రితం భవనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.కొద్ది రోజుల పాటు భార్యతో ప్రేమగా నటించిన భర్త ఆ తర్వాత నుంచి శాడిజం చూపించడం మొదలుపెట్టాడు. బాత్రూంలో శృంగారం చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు ఆమె నిరాకరిస్తే.. బలవంతంగా తీసుకువెళ్లి మరీ తన కోరిక తీర్చుకునేవాడు.

ప్రతిరోజూ ఇదే రకంగా బాత్రూమ్ లో సెక్స్ చేయాలని ఇబ్బంది పెడుతుంటే ఆమె అందుకు నిరాకరించింది.దీంతో కొట్టడం, చిత్ర హింసలు పెట్టడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులే తట్టుకోలేకపోతున్న ఆమెకు.. భర్త సోదరుడు కూడా తోడయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని ఆమె బావగారు కోరిక తీర్చాలని వేధించడం గమనార్హం.

రోజూ ఈ వేధింపులు తీవ్రతరం అవుతుండటంతో తట్టుకోలేక పోయిన యువతి గోమతిపూర్ లోని తన పుట్టింటికి చేరింది. తన తండ్రి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.