Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి నేనే అంటూ...: వీడియోను షేర్ చేసిన డోనాల్డ్ ట్రంప్

బాహుబలిలోని ప్రభాస్ పాత్ర బాహుబలి ముఖాన్ని మార్ఫ్ చేసి తన ముఖాన్ని అతికించి పెట్టిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ సతీమణి ట్రంప్ ముఖాన్ని రమ్యకృష్ణ ముఖానికి అతికించిన క్లిప్ కూడా ఉంది.

Ahead Of India Visit, Donald Trump Shares Video Of Himself As "Baahubali"
Author
New Delhi, First Published Feb 23, 2020, 9:14 AM IST

న్యూఢిల్లీ: భారత పర్యటనకు బయలుదేరడానికి కొద్ది గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాహుబలి 2 సినిమాను ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేశారు. బాహుబలిలోని ప్రభాస్ ఫోటోను మార్ఫ్ చేసి తన ముఖం పెట్టిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

గుర్తు తెలియని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆ వీడియోకు భారత దేశంలోని తన గొప్ప మిత్రులను కలుసుకోవడానికి చూస్తున్నానని అంటూ శీర్షిక పెట్టి ట్రంప్ దాన్ని షేర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో జయో రే బాహుబాలి పాట వినిపిస్తూ ఉంటుంది. 

ఆ వీడియోలో ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా కనిపిస్తుంది. బాహుబలిలోని రమకృష్ణ పాత్ర శివగామి ముఖాన్ని ఆమె ముఖంతో మార్ఫింగ్ చేసి పోస్టు చేశారు. నరేంద్ర మోడీ ముఖాన్ని కూడా మార్ఫ్ చేసి పెట్టిన క్లిప్ కొద్ది సెకన్లు కనిపిస్తుంది.

 

ఆ వీడియోలో ట్రంప్ కత్తి యుద్ధం చేస్తూ కనిపిస్తాడు. రథంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. గుర్రాలపై స్వారీ చేస్తూ యుద్ధం చేస్తూ కనిపిస్తాడు. అమెరికా, ఇండియా యునైటెడ్ అనే సందేశంతో వీడియో ముగుస్తుంది. 

డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం భారత్ చేరుకుంటారు. ఆయన నేరుగా అహ్మదాబాద్ వస్తారు. విమానాశ్రయం నుంచి రోడ్ షో చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతేరా స్టేడియం చేరుకుంటారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను కూడా ఆయన సందర్శిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios