Asianet News TeluguAsianet News Telugu

పబ్లిక్ ప్లేస్ లో భార్యతో శృంగారం.. ఆ తర్వాత రేవు వద్దకు తీసుకెళ్లి..

ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ హత్యకు ముందు అతను చేసిన పని అక్కడి పోలీసులను విస్మయానికి గురిచేసింది.

After Physical Relationship Husband kills wife in Uttar pradesh
Author
Hyderabad, First Published Feb 10, 2021, 12:22 PM IST


మన సమాజంలో ప్రతిరోజూ వందల, వేల సంఖ్యలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రకాల నేరాలు బయటపడుతున్నాయి. నేరస్థులకు శిక్షలు కూడా పడుతున్నాయి. ఇప్పటి వరకు చాలా కేసుల గురించి మీరు చూసి ఉంటారు. అయితే.. వాటన్నింటిలో ఈ కేసు మాత్రం చాలా భిన్నంగా ఉందని పోలీసులు  చెప్పడం విశేషం.

ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ హత్యకు ముందు అతను చేసిన పని అక్కడి పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ కి చెందిన ఓ మహిళ శవం ఓ నదిలో లభ్యమైంది. కాగా.. ఈ కేసులో అనుమానితుడిగా.. ఆమె భర్తను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హమీర్పూర్ ప్రాంతానికి చెందిన ఓ  వ్యక్తికి  కంచన్ అనే మహిళ తో  రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. కాగా.. ఇటీవల భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భార్య అలిగి తన పుట్టింటికి వెళ్లింది.

పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి ఇంటికి రావాలంటూ అతను బ్రతిమిలాడాడు. భర్త నిజంగానే ప్రేమతో పిలుస్తున్నాడని ఆమె నమ్మింది. భర్త రమ్మన్న చోటుకి వెళ్లింది. అక్కడ అతను భార్యతో చాలా ప్రేమగా ఉన్నట్లు నటించాడు. ఆమెతో పబ్లిక్ గా అక్కడే శృంగారంలో పాల్గొన్నాడు. అనంతరం నది వద్దకు తీసుకువెళ్లి అక్కడో తోసేసి చంపేశాడు. అనంతరం తనకేమీ తెలియనట్లుగా వ్యవహరించాడు. అయితే.. శవం దొరకడంతో కేసు మలుపు తిరిగింది. అనుమానంతో విచారించగా నేరం అంగీకరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios