మహిళలను వరసగా హత్య చేస్తున్న వ్యక్తిని కోల్ కతా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసుకొని అతను వరస హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ కి చెందిన కామరుజ్జమాన్ సర్కార్ (41) అనే వ్యక్తి, పాత వస్తువులను అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. కాగా అందరి ముందు మంచి వ్యక్తిగా నటిస్తూనే మహిళలను హత్య చేస్తున్నాడు. మహిళలతో శృంగారం చేసి.. ఆ తర్వాతే వాళ్లను హత్య చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.  

‘‘అధునాత దుస్తుల్లో మద్యాహ్న సమయంలో ఇళ్లల్లోకి ప్రవేశిస్తాడు కామరుజ్జమాన్. కొద్ది సేపు మహిళను మాటలతో మాయ చేస్తాడు. ఆ తర్వాత ఆమెతో సెక్స్ కోరిక తీర్చుకొని వెంటనే ఇంట్లోని కరెంట్ నిలిపివేస్తాడు. ఆ తర్వాత  సైకిల్ చైన్‌తో మహిళ మెడను మెలిపెడతాడు. అనంతరం రాడ్‌తో కొట్టి చనిపోయారని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచిపరారవుతాడు’’ అని పోలీసులు తెలిపారు. ఇలా ఐదుగురు మహిళల్ని చంపినట్లు పేర్కొన్నారు. అయితే మరికొన్ని హత్యలతో కూడా సర్కార్‌కు సంబంధముందేమోనని అనుమానిస్తున్నట్లు, ప్రస్తుతం ఆ విషయమై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.