బెంగళూరు టెస్టు :చిన్న స్వామి స్టేడియంలో రంజాన్ సెలబ్రేషన్స్

afghan cricketers ramzan celebrations
Highlights

ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న క్రికెటర్లు

బెంగళూరు టెస్టు మ్యాచ్ లో రెండో రోజు గ్రౌండ్ లో పండగ వాతావరణం నెలకొంది. ఆప్ఘానిస్థాన్ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియంలో వారి దేశ సంస్కృతికి అద్దం పట్టేలా రంజాన్ పండగ జరుపుకున్నారు. రెండో రోజు ఆట ఆరంభానికి ముందు గ్రౌండ్ లోకి సాంప్రదాయ దుస్తుల్లో ప్రవేశించిన అప్ఘాన్ ఆటగాళ్లు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే తమకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న క్రికెట్ అభిమానులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ సందర్భంగా ఆటగాళ్లకు బిసిసిఐ రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది. వారు బెంగళూరు స్టేడియానికి పండగ శోభను తీసుకువచ్చారంటూ అప్ఘాన్ ప్లేయర్లు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న ఫోటోను బిసిసిఐ ట్వట్టర్ లో పెట్టింది.

ఇవాళ ఉదయాన్నే ఆప్ఘాన్ ఆటగాళ్లు తాము బస చేసిన  హైటల్లో కూడా ఈద్ ఉల్ ఫీతర్ సంభరాలు జరుపుకున్నారు. ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది ఉదయం నమాజ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.   

 

 

loader