ఈ సవాల్ ను స్వీకరిస్తారా, సార్: కోహ్లీకి మోడీ రిప్లైపై తేజస్వీ

ఈ సవాల్ ను స్వీకరిస్తారా, సార్: కోహ్లీకి మోడీ రిప్లైపై తేజస్వీ

పాట్నా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చాలెంజ్ ను అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్ నుంచి సవాల్ ఎదురైంది. విరాట్ కోహ్లీ సవాల్ ను స్వీకరించిన మోడీ ఇప్పుడు తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. ట్విటర్ వేదికగా ఆయన మోడీని ప్రశ్నించారు. 

విరాట్ కోహ్లీ సవాల్ ను మోడీ స్వీకరించడంపై తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు ఊరట, దళితులకూ మైనారిటీలపై హింస నివారణ లాంటి సవాళ్లను మోడీ స్వీకరించగలరా అని అన్నారు. 

ఈ చాలెంజ్ ను కూడా మీరు స్వీకరిస్తారామోడీ సార్ అని తేజస్వీ ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ దేశ ప్రజలకు ట్విటర్‌లో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. రాథోడ్‌ చాలెంజ్‌ను స్వీకరించిన కోహ్లీ జిమ్‌లో తాను వర్కవుట్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్రధాని మోడీ, భార్య అనుష్క, సహచర క్రికెటర్ ధోనీలను కోరాడు. 

కోహ్లీ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోడీ  తాను కూడా త్వరలోనే ఓ ఫిట్‌నెస్ వీడియో పోస్టు చేస్తానని చెప్పారు. దానిపై తేజస్వీ యాదవ్ ప్రతిస్పందిస్తూ తాను విసిరే సవాళ్లను కూడా మోడీ స్వీకరించాలని కోరారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page