స్వయం సమృద్ధ భారతం అంటే ఇది: రాజీవ్ చంద్రశేఖర్
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీపై అనేక రాజకీయ పార్టీలు విమర్శలను కూడా చేస్తున్నాయి. ఇది ఇండస్ట్రీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రాదు అని అంటున్న తరుణంలో రాజ్యసభ ఎంపీ, యువ పారిశ్రామికవేత్త రాజీవ్ చంద్రశేఖర్ ఈ ప్యాకేజి ఎలా పనిచేస్తుందో చెప్పడమే కాకుండా... ఈ ప్యాకేజీని ప్రకటించేకన్నా ముందే అనేక మంది పారిశ్రామికవేత్తలతో చర్చించి, ఇండస్ట్రీకి ఎలాంటి ప్యాకేజి అవసరమో, భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు అవసరమో ప్రభుత్వానికి సూచించారు.
కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి, మందు కూడా ఇంకా అందుబాటులో లేకపోవడం, భారతీయ హెల్త్ సిస్టం ను ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ధీటుగా తయారుచేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే!
ప్రస్తుతం నాలుగవ దఫా లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసందే. దాదాపుగా రెండు నెలల లాక్ డౌన్ వల్ల భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ఒకరకంగా పడకేసిన విషయం తెలిసిందే. ఆర్ధిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే!
ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీపై అనేక రాజకీయ పార్టీలు విమర్శలను కూడా చేస్తున్నాయి. ఇది ఇండస్ట్రీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రాదు అని అంటున్న తరుణంలో రాజ్యసభ ఎంపీ, యువ పారిశ్రామికవేత్త రాజీవ్ చంద్రశేఖర్ ఈ ప్యాకేజి ఎలా పనిచేస్తుందో చెప్పడమే కాకుండా... ఈ ప్యాకేజీని ప్రకటించేకన్నా ముందే అనేక మంది పారిశ్రామికవేత్తలతో చర్చించి, ఇండస్ట్రీకి ఎలాంటి ప్యాకేజి అవసరమో, భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు అవసరమో ప్రభుత్వానికి సూచించారు.
ఈ లాక్ డౌన్ కాలంలో లోన్ల మీద 6 నుంచి 9 నెలల మోరటోరియం ఇవ్వవలిసిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా చిన్న పరిశ్రమలకు జిఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కోరారు. ఈ లాక్ డౌన్ వల్ల అత్యధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఎంఎస్ఎంఈ లు అని వాటిని ఆదుకోవాలని ఆయన చేసారు.
ఇక ప్రభుత్వం ప్యాకేజి ప్రకటించిన తరువాత దాని అవసరాన్ని ఆయన వివరించారు. కరోనా షాక్ నుంచి కోలుకునేందుకు కేంద్రం ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయని ఒకటి కరోనా తో పోరాడుతున్న రాష్ట్రాలకు సహకారం అందించడంతోపాటుగా రెండవది పేదల, బలహీన వర్గాల వారి జీవనోపాధిని కాపాడటం అని ఆయన తెలిపారు.
ఇందుకోసం రాష్ట్రాలకు వెంటనే ఆర్బీఐ ద్వారా అవసరమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని, ఇక పేదల కోసం వెంటనే గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్ష 70 వేల కోట్లను ఇచ్చారని అన్నారు.
ఆ తరువాత వెంటనే సమాజంలో విశ్వాసాన్ని కల్పించి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని భారతీయ ఆర్ధిక వ్యవస్థను మరింతగా విస్తరించాలని అన్నారు. ఇలా విస్తరించే క్రమంలో తీసుకొచ్చే అప్పుల భారాన్ని తట్టుకునేలా మరింత ధృడంగా తయారవ్వాలని అన్నారు.
ఇలా భారతదేశాన్ని ఈ కష్టం నుంచి బయట పడేసేందుకు పైన పేర్కొన్న అన్ని అవసరమైన చర్యలను కూడా ఈ ప్రభుత్వం చేప్పటిందని, అందులో భాగంగానే ప్రజలకు అవసరమైన అన్ని ప్యాకేజీలను ప్రభుత్వం ఇచ్చిందని ఆర్బీఐ తీసుకున్న చర్యల నుంచి పేదలకు ఇచ్చిన ప్యాకేజి వరకు అన్ని కూడా ఇందుకోసమే అని అన్నారు.
కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయంగా భారతదేశానికి అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఈ మహమ్మారి వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకుంటూనే... ఇందులో ఒక నూతన అవకాశాన్ని కూడా ప్రధాని చూసారని, విదేశీ పెట్టుబడులన్నిటికి భారతదేశం ఒక చిరునామాగా మారాలని ప్రధాని సంకల్పించారని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ అంటే... భారతదేశం కేవలం అమనకు అవసరమైన అన్ని వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడమే కాకుండా... ఎల్లవేళలా ప్రపంచం లోని అన్ని దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే రీతిలో ఆర్థిక వ్యవస్థ తయారవ్వాలని ప్రధాని ఆకాంక్షించారని ఆయన అన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని అన్నారు.