ఓ యువకుడికి 5 రోజుల పాటు తినడానికి ఎలాంటి ఆహారమూ దొరకలేదు. చేతిలో డబ్బుల లేదు.. ఆ ప్రాంతంలో తెలిసిన వారు కూడా ఎవరూ లేరు.. దీంతో ఆకలి తీర్చుకోవడానికి పిల్లి పచ్చి మాంసమే ఆహారంగా తీసుకున్నాడు. (Young man in Kerala ate cat-mad meat after starving for 5 days) ఈ ఘటన కేరళలో జరిగింది. 

కేరళలో హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల పాటు ఆకలితో అలమటించిన ఓ యువకుడికి తినడానికి ఏమీ దొరక్కపోవడంతో పిల్లి పచ్చి మాంసం తిన్నాడు. ఉత్తర కేరళ జిల్లా కుట్టిపురంలో రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడు బస్టాండ్ మెట్లపై కూర్చొని చనిపోయిన పిల్లి పచ్చి మాంసాన్ని తినడాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

బీజేపీలో చేరాలని బలవంత పెడుతున్నారు - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువకుడు అస్సాంలోని ధుబ్రి జిల్లాకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. వయస్సు 27 సంవత్సరాలు ఉంటుందని తెలుసుకున్నారు. తాను ఐదు రోజుల నుంచి ఏమీ తినలేదని, అందుకే ఆకలితో పిల్లి మాసం తిన్నానని ఒప్పుకున్నాడు. ఆ యువకుడు కాలేజీ స్టూడెంట్ అని, కుటుంబ సభ్యులకు చెప్పకుండా గతేడాది డిసెంబర్ లో రైలులో కేరళకు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు.

Scroll to load tweet…

పోలీసులు ఆ యువకుడి వివరాలు ఆరా తీయడంతో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న సోదరుడి మొబైల్ నెంబర్ ఇచ్చారు. దీంతో అతడికి ఫోన్ చేశారు. ఆ యువకుడు చెప్పిన వివరాలన్నీ సరైనవే అని నిర్ధారించుకున్నారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం యువకుడిని పొరుగున త్రిస్సూర్ లో ఉన్న ఓ హాస్పిటల్ లో చేర్పించారు. యువకుడు శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలతో బాధపడటం లేదు. ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఉన్న ఆ యువకుడిని.. బంధువులు వచ్చిన వెంటనే అప్పగించాలని భావిస్తున్నారు.