రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని  రాయ్‌పూర్ లో  రెండంతస్తుల భవనం శుక్రవారం నాడు కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం పక్క భిల్డింగ్ కుప్పకూలింది.  ఈ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ కూడ ఎలాంటి గాయాలు కాలేదు.

అశీష్ మిశ్రా రెండు అంతస్తుల భవనం యజమాని.  ఈ భవనం పెట్రోల్ పంప్ పక్కన ఉంటుంది. ఈ భవనాన్ని సురేష్ కేశ్వానికి అద్దెకు ఇచ్చాడు.   సురేష్  ఇక్కడ రెస్టారెంట్ నిర్వహించేవాడు.  ఈ భవనం పక్కనే ఉన్న మైలేష్ కొతారి కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది.  దీని కోసం   తవ్వకాలు జరుపుతున్నారు. 

ఈ సమయంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం  ఒక్కపక్క ఒరిగిపోయింది. భవనం ఒరగడం చూసిన ఉద్యోగులు భవనం నుండి బయటకు వచ్చారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకొందని ఈ కారణంగానే ఈ భవనం కూలిపోయిందని  పోలీస్ స్టేషన్ ఇంచార్జీ రమాకాంత్ సాహు ప్రకటించారు.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని  పోలీసులు తెలిపారు.